మద్దూరు, 9 November
మండలంలోని గాగీల్లాపూర్ గ్రామంలో విబిజి రాంజీ పథకం కింద చేపట్టిన ఫిష్ పాండ్ పనులను గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనకచంద్రం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో శ్రీనివాస్ హాజరయ్యారు.
మండలంలోని గాగీల్లాపూర్ గ్రామంలోని పెద్ద చెరువును ఆనుకొని, విబిజి రాంజీ పథకం కింద చేపట్టిన ఫిష్ పాండ్ పనులను గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనకచంద్రం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో శ్రీనివాస్, విబిజి రాంజీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు తగు సూచనలు చేశారు. జలసిరికి సంబంధించిన ఇంకుడు గుంతలు, పాంపౌండ్స్, బోర్ రీఛార్జ్ గుంతలు, ఫిష్ పాండ్స్ వంటి వాటిని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. వీరితోపాటు ఏపీఎం మంజుల, కార్యదర్శి రజియా, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత సిద్ధులు, వార్డు సభ్యులు సలాది కళావతి, కరోబార్ శ్రీకాంత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.


