కుత్బుల్లాపూర్, 11 November
నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాల గ్రంథాలయాన్ని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ, విద్యార్థులు మొబైల్ ఫోన్లలో సమయాన్ని వృధా చేసుకోకుండా పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి జరుగుతుందని ఆయన తెలిపారు.
విద్యాభ్యాసంలో ఆసక్తి ఉండి, పేదరికం కారణంగా విద్యకు దూరమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించి, వారు విద్యాభ్యాసాన్ని కొనసాగించేలా వారి తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతను తెలియజేసేలా పాఠశాల ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేలా, తన సొంత నిధులతో ఇంటర్మీడియట్, వొకేషనల్, డిగ్రీ కళాశాలలను నిర్మించానని, నిరుపేద విద్యార్థులు ఈ కళాశాలలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వసుంధర, పాఠశాల ప్రిన్సిపాల్ కమల్ సింగ్, స్థానిక సంక్షేమ సంఘాల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






