భారత్ నుంచి ప్రపంచ ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన రెండో వార్షిక గ్లోబల్ హెల్త్ కాంగ్రెస్ () 2026 న్యూయార్క్‌లో విజయవంతంగా ముగిసింది. నుంచి 11 వరకు జరిగిన ఈ సదస్సుకు 25కి పైగా దేశాల నుంచి 625 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. 360కి పైగా హెల్త్‌కేర్ స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి.
యేల్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ సిటీలో జరిగిన ఈ సదస్సుకు 125 మందికి పైగా వక్తలు, 350కి పైగా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హెల్త్‌కేర్ షార్క్ ట్యాంక్, గ్లోబల్ వెంచర్ ఫోరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
హెల్త్‌కేర్ స్టార్టప్‌ల పోటీ
35కి పైగా దేశాల నుంచి 360కి పైగా హెల్త్‌కేర్ స్టార్టప్‌లు పోటీలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 15 సంస్థలను ఫైనలిస్టులుగా ఎంపిక చేసి, న్యూయార్క్‌లో పెట్టుబడిదారులు, వైద్య నిపుణులు, వ్యాపారవేత్తల ముందు తమ ఆవిష్కరణలను ప్రదర్శించే అవకాశం కల్పించారు. 2026 వెంచర్ ఫోరం విజేతలుగా ఫ్లోరెన్స్ (), బ్రెయివ్ (), వింక్ () సంస్థలు నిలిచాయి.
ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త, షార్క్ ట్యాంక్ పెట్టుబడిదారు రాబర్ట్ హెర్జావెక్ నాయకత్వం వహించారు.
ప్రముఖుల హాజరు
బార్క్లేస్ గ్రూప్ సీఈఓ సి.ఎస్. వెంకటకృష్ణన్, హిటాచీ హై-టెక్ అమెరికా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శశాంక్ సమంత్, ర్యాక్‌స్పేస్ టెక్నాలజీ సీఈఓ గజెన్ కందియా, మైక్రోసాఫ్ట్‌కు చెందిన డాక్టర్ డేవిడ్ ర్యూ తదితర ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సుమారు 150 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, 150 మందికి పైగా వైద్యులు, 100 మందికి పైగా స్టార్టప్ వ్యవస్థాపకులు హాజరయ్యారు.
భారత్ పాత్ర పెంపు లక్ష్యం
భారత్‌లోని వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పారిశ్రామికవేత్తల ప్రతిభను ప్రపంచ ఆరోగ్య రంగంతో అనుసంధానించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని గ్లోబల్ హెల్త్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ అచింత్య మౌలిక్ తెలిపారు. పాశ్చాత్య దేశాల ఆవిష్కరణలకు భారత్ కేవలం మార్కెట్‌గా మాత్రమే ఉండకూడదని, భారత్ నుంచి కూడా ప్రపంచానికి వినూత్న ఆరోగ్య పరిష్కారాలు అందాలని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్, అమెరికా, యూకే, మధ్యప్రాచ్య దేశాల మధ్య వైద్యరంగం, సాంకేతికత, పెట్టుబడులు, స్టార్టప్‌ల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా టెక్నో ఇండియా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేఘదూత్ రాయ్‌చౌదరి భారత అధ్యాయానికి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు లూమిస్ మేనేజింగ్ పార్ట్నర్ సందీప్ సిన్హా కూడా ఈ బాధ్యతల్లో భాగస్వాములు కానున్నారు.
న్యూయార్క్‌లో జరిగిన రెండో వార్షిక గ్లోబల్ హెల్త్ కాంగ్రెస్ () 2026 విజయవంతంగా ముగిసింది. మే 9 నుంచి 11 వరకు జరిగిన ఈ సదస్సుకు 25కి పైగా దేశాల నుంచి 625 మందికి పైగా ప్రతినిధులు, 360కి పైగా హెల్త్‌కేర్ స్టార్టప్‌లు హాజరయ్యాయి. భారత్ నుంచి ప్రపంచ ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.






