రఘునాథపాలెం, పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశంలో విద్యార్థి తండ్రి షేక్ సమద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు.
రఘునాథపాలెం, పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశం ఘనంగా జరిగింది.
ఈ సమావేశంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి తండ్రి షేక్ సమద్ మాట్లాడుతూ, పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమని అన్నారు.
ఇంటి వద్ద పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, చదువుతో పాటు మంచి అలవాట్లు, సంస్కారం, నైతిక విలువలు నేర్పించినప్పుడే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు.
పిల్లలు లక్ష్యం నిర్దేశించుకొని, కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని, తల్లిదండ్రులు అండగా ఉండి ప్రోత్సహిస్తే విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదుగుతారని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ రెంటాల ప్రసాద్, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


