ఖమ్మం, 2025-11-12
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఖమ్మం 129వ మహాజన సభ గురువారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో 2025-26 వార్షిక నివేదిక, ఖర్చులు, లాభాల కేటాయింపులు, స్టాట్యూటరీ ఆడిట్ నివేదికలను సభ్యులు ఆమోదించారు. అదనపు ఎజెండాగా ఏ క్లాస్ సంఘాలకు డివిడెండ్ చెల్లింపు, ఉద్యోగులకు ఇన్సెంటివ్ వంటి అంశాలను చర్చించి ఆమోదించారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఖమ్మం 129వ మహాజన సభ గురువారం ఉదయం 11:30 గంటలకు బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగింది. బ్యాంకు పీఐసీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో 2025-26 వార్షిక నివేదిక, ఖర్చులు, లాభాల కేటాయింపులు, స్టాట్యూటరీ ఆడిట్ నివేదికలను సభ్యులు ఆమోదించారు.
అదనపు ఎజెండాగా ఏ క్లాస్ సంఘాలకు 2025-26కు డివిడెండ్ చెల్లింపు, ఉద్యోగులకు ఇన్సెంటివ్, నాబార్డ్ అంబ్రెల్లా ప్రాజెక్టులో భాగంగా నూతన సీబీఎస్ పినాకిల్ కు మైగ్రేషన్, ఎస్ఎస్పీఎల్ సహకార సారథి ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం వంటి అంశాలను చర్చించి ఆమోదించారు.
రైతుల డిమాండ్లు
సభలో పలు సంఘాల అధ్యక్షులు తమ డిమాండ్లను వినిపించారు. మోటాపురం సంఘ అధ్యక్షుడు భాగం హేమంతరావు మాట్లాడుతూ, ఎల్ నినో కారణంగా వర్షాలు లేక రైతులు నష్టపోయారని, కేంద్రం ఇస్తున్న 3 వడ్డీ రాయితీలా రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 ఇచ్చి ఆదుకోవాలని కోరారు. వర్షాభావం కారణంగా రుణాలకు మారటోరియం ప్రకటించాలని పలువురు కోరారు. సంఘాల ద్వారా పామ్ ఆయిల్ సేకరణ కేంద్రాలు ప్రారంభించాలని, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, ధాన్యానికి మద్దతు ధర పెంచాలని కోరారు. మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని, వారికి ఆర్థిక సాయం అందించాలని కోరారు.
కలెక్టర్ స్పందన
బేతుపల్లి చెరువు రెస్క్యూ ఆపరేషన్ లో కలెక్టర్ పనితీరును సంఘ అధ్యక్షులు అభినందించారు. సంఘ అధ్యక్షుల డిమాండ్లన్నీ పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ సీఈఓను ఆదేశించారు. బ్యాంకు సీఈఓ ఎన్. వెంకట ఆదిత్య మాట్లాడుతూ, బ్యాంకు ప్రతి నిర్ణయం రైతు శ్రేయస్సు కోరేలా ఉంటుందని, సంఘ అధ్యక్షులు బ్యాంకుతో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా సహకార అధికారి జి. గంగాధర్ రావు, కొత్తగూడెం జిల్లా సహకార అధికారి ఏ. శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లారావు, బ్యాంకు డీజీఎంలు జి. ఉదయశ్రీ, జి. వేణుగోపాల్ రావు, ఎం. సర్వేశ్వరరావుతో పాటు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.






