4న (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 02
కెరమెరి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంచార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సాయిరాం తెలిపారు. ఈ సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతుంది.
కెరమెరి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంచార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సాయిరాం తెలిపారు. ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించే ఈ సమావేశం, బుధవారం మధ్యాహ్నం 2.00 గంటలకు కెరమెరి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతుందన్నారు.
ఈ సమావేశానికి గ్రామ పంచాయతీ సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు తమతమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను 50 కాపీలు చొప్పున 4వ తేదీ లోపు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
సమీక్షించనున్న అంశాలు
ఈ సమావేశంలో మొత్తం 19 ఎజెండా అంశాలపై సమీక్షించనున్నారు. వ్యవసాయం, ఉపాధి హామీ, మిషన్ భగీరథ, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఇంజనీరింగ్ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా శిశు సంక్షేమం, ప్రజా పంపిణీ, వెలుగు-ఇందిరా క్రాంతి పథకం, గ్రామ పంచాయతీ పరిపాలన, విద్యాశాఖ, ఐటీడీఏ, మధ్యతరహా నీటిపారుదల, ఆర్టీసీ, ఆర్ అండ్ బి శాఖల కార్యక్రమాలపై సమీక్షతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు.






