ఖమ్మం, 2026-11-10
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని నిర్మాణ రంగంలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్. మాధవి తెలిపారు.
ఉద్యోగ వివరాలు జీతం
జనరల్ హెల్పర్స్ ఉద్యోగానికి నెలకు 1,050 (సుమారు రూ. 27,080) జీతం ఉంటుంది. దీనికి ఎలాంటి నైపుణ్య పరీక్ష అవసరం లేదు. షట్టరింగ్ కార్పెంటర్స్, స్టీల్ ఫిక్టర్స్, మేసన్స్ వంటి నైపుణ్యం కలిగిన వారికి నెలకు 1,350 (సుమారు రూ. 34,830) జీతంతో పాటు అదనపు బోనస్ కూడా లభిస్తుంది.
అర్హతలు సౌకర్యాలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 22 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. కాంట్రాక్ట్ వ్యవధి 2 సంవత్సరాలు. కంపెనీ ఉచిత విమాన టికెట్, ఉచిత వసతి, రోజుకు మూడు పూటల ఉచిత భోజనం, ఉచిత రవాణా వంటి సౌకర్యాలను కల్పిస్తుంది.
దరఖాస్తు విధానం
ఆసక్తి గల అభ్యర్థులు 08035524946 నంబర్‌కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా 040-23342040 కార్యాలయ నంబర్లో సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం .... వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే, జిల్లా ఉపాధి కల్పనా శాఖ కార్యాలయం, రూం నెం. 18, మొదటి అంతస్తు, కలెక్టరేట్, వెంకటాయపాలెం, ఖమ్మం చిరునామాలో లేదా .. ఈమెయిల్ ద్వారా కూడా వివరాలు పొందవచ్చు.
జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మాధవి కోరారు.






