లియాంగ్పెయ్ ఏఐ యాప్‌లో చేరడానికి ఏడాదికి 2,000 చైనా యువాన్లు (సుమారు రూ.28 వేలు) ఫీజుగా వసూలు చేస్తున్నారు.
లియాంగ్పెయ్ ఏఐ యాప్‌లో చేరడానికి ఏడాదికి 2,000 చైనా యువాన్లు (సుమారు రూ.28 వేలు) ఫీజుగా వసూలు చేస్తున్నారు. వినియోగదారుల వ్యక్తిత్వం, కుటుంబ నేపథ్యం, విద్య, ఉద్యోగం, అభిరుచులు, జీవనశైలి, వివాహంపై వారి అంచనాలను ఏఐ ద్వారా విశ్లేషించి, సరైన జీవిత భాగస్వామిని సూచించడం ఈ యాప్ ప్రత్యేకత. సాధారణంగా ఇతర డేటింగ్ యాప్‌లలో ఒకేసారి పలువురితో పరిచయాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే, లియాంగ్పెయ్ ఏఐ మాత్రం ఒక సమయంలో ఒక్కరితో మాత్రమే మాట్లాడే విధానాన్ని అమలు చేస్తోంది. ఇది సంబంధాలు లోతుగా ఏర్పడటానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. సంబంధాల్లో సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కార మార్గాలు సూచించడానికి ఏఐ స్ట్రాటజిస్ట్ అనే ప్రత్యేక ఫీచర్‌ను కూడా ఈ యాప్ అందిస్తోంది. ఇది వినియోగదారులకు మార్గనిర్దేశం చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్‌లో 35 వేల మందికి పైగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. అయితే, మూడేళ్లలో వివాహం జరగకపోతే డబ్బు తిరిగి చెల్లిస్తామన్న హామీ ఎంతవరకు అమలు అవుతుందనే దానిపై ఇంకా స్పష్టమైన ఫలితాలు వెల్లడికాలేదు. ఈ హామీ అమలు తీరుపైనే యాప్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.





