రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎస్.ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో మోడల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి చింతల రమేష్ తెలిపారు. ఈ పరీక్షలు రాష్ట్ర స్థాయి పరీక్షలకు ధీటుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించే ఎస్.ఐ, కానిస్టేబుల్ పరీక్షకు ధీటుగా, అదే స్థాయిలో జిల్లా కేంద్రంలో ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోడల్ ఎస్.ఐ, కానిస్టేబుల్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు, ఈ పరీక్షను అభ్యర్థులందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్యదర్శి చింతల రమేష్ అన్నారు. స్థానిక ఎన్.టి.ఆర్ సర్కిల్లోని బి.సి. స్టడీ సర్కిల్లో పరీక్ష పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం, ఖమ్మంలోని బైపాస్ రోడ్డులో రామకృష్ణ ఫంక్షన్ హాల్లో నడుస్తున్న పి.ఎస్.ఆర్ కోచింగ్ సెంటర్లో, అలాగే నగరంలోని వివిధ స్టడీ సర్కిల్స్, కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్స్‌లో పరీక్ష విజయవంతం కావడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలో జరగబోయే ఎస్.ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ మేధావులు, విద్యావేత్తలతో తయారుచేసిన మోడల్ పేపర్‌తో ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోడల్ ఎస్.ఐ, కానిస్టేబుల్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా అభ్యర్థులు తమ స్థాయిని అంచనా వేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ పరీక్ష ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో వివిధ చోట్ల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతుందని, కావున ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్, ఎస్.ఐ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ తప్పకుండా మోడల్ పరీక్ష రాసి, జిల్లా స్థాయిలో వారి ప్రతిభను, ర్యాంకును తెలుసుకొని, భవిష్యత్తులో రాయబోయే ప్రభుత్వ పరీక్షలకు మరింత బాగా చదువుకోవడానికి ఈ పరీక్షలు చాలా ఉపయోగపడతాయని, అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరీక్షకు సంబంధించిన వివరాల కోసం సెల్ నంబర్లు 9908842328, 9490469559, 9963918170 లను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మద్దోజు శ్రావణ్, నగర కార్యదర్శి చిరా కృష్ణ ప్రసాద్, జిల్లా యంగ్ ఉమెన్ నాయకులు బొప్పి ఉమా, జిల్లా నాయకులు శ్రీకాంత్, సురేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.



