ఖమ్మం, 11 November
ప్రభుత్వ వైద్య కళాశాలలో 60 అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితా ప్రకటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు కళాశాల ప్రిన్సిపాల్/అడిషనల్ డి.ఎం.ఈ. డా. టీ. శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 60 అవుట్సోర్సింగ్ పోస్టులకు గాను దరఖాస్తులను ఆహ్వానించగా, ఆశించిన దానికంటే అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయని తెలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుండటంతో, నిర్ణీత సమయంలో ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేయడం సాధ్యపడలేదని ప్రిన్సిపాల్ వివరించారు.
కొత్త తేదీ వివరాలు
వీలైనంత త్వరగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి, ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేసే కొత్త తేదీ వివరాలను ప్రభుత్వ వైద్య కళాశాల అధికారిక వెబ్సైట్, జిల్లా అధికారిక వెబ్సైట్, కళాశాల నోటీసు బోర్డు నందు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కావున, అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించగలరని ప్రిన్సిపాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






