ఖమ్మం, 11 November
తెలంగాణ రాష్ట్రంలోని 21,893 పాఠశాలలకు లైబ్రరీ నిధులు (ప్రాథమిక పాఠశాలలకు రూ.1171, ఉన్నత పాఠశాలలకు రూ.5198 చొప్పున) ఖాతాకు జమ అయ్యాయి. ఈ నిధులతో 20,182 పాఠశాలలకు లైబ్రరీ పుస్తకాలు ఆయా మండలాలకు చేరాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ మండల విద్యాధికారులను సంప్రదించి పుస్తకాలు తీసుకోవచ్చు.
సుమారు 1,711 పాఠశాలల వివరాలు వద్ద లేకపోవడంతో ఆయా పాఠశాలలకు పుస్తకాలు పంపబడలేదు.
పుస్తకాలు అందని పాఠశాలలకు సూచన
పుస్తకాలు అందని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, నగదు చెల్లించిన రసీదు వివరాలు, ఆధారాలు, పాఠశాల చిరునామాను వారికి ఈ-మెయిల్ ద్వారా పంపితే మండలంలో పుస్తకాలు అందని పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో ఉంటే, ఆ మండల విద్యాధికారి ద్వారా పంపాలి) వారు పుస్తకాలను పోస్టు ద్వారా పంపిస్తారు.






