ఖమ్మం, 11 November
ఖమ్మం జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు.
జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వ్యవసాయ, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ లో 3 నెలలకు, వైరా రిజర్వాయర్ లో 5 నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఉన్న నీటిని తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
రైతులు వరి, మొక్కజొన్న వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేయకుండా, తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలు వేసేలా చైతన్యం తేవాలని అన్నారు. ఇందుకోసం కళాజాత బృందాలతో, వాయిస్ మెసేజ్ ల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఉద్యానవన అధికారి మధుసూదన్, పశుసంవర్థక అధికారి డా. పురందర్, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాస చారి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

