ఖమ్మం, 11 November
తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నర్సరీ నుండి యూనివర్సిటీ వరకు సమగ్ర విద్యా విధానాన్ని తీసుకురానున్నారు. ఈ సంస్కరణల ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నర్సరీ నుండి యూనివర్సిటీ వరకు సమగ్ర విద్యా విధానాన్ని తీసుకురానున్నారు. ఈ సంస్కరణల ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త విద్యా నిర్మాణం
కొత్త విద్యా నిర్మాణం ప్రకారం, నర్సరీ నుండి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5వ నుండి 8వ తరగతి వరకు సెకండరీ విద్య, 9వ నుండి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్య అమలు చేయనున్నారు. ఈ విధానం ద్వారా 12వ తరగతి వరకు విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
ఉపాధ్యాయుల కేటాయింపు
ఈ సంస్కరణల్లో భాగంగా ఉపాధ్యాయుల కేటాయింపులో కూడా మార్పులు చేయనున్నారు. లు నర్సరీ నుండి 4వ తరగతి వరకు బోధన చేస్తారు. స్కూల్ అసిస్టెంట్లు 5 నుండి 8వ తరగతి వరకు బోధన బాధ్యతలు నిర్వహిస్తారు. 9 నుండి 12వ తరగతులకు సబ్జెక్టు నిపుణులు, జూనియర్ లెక్చరర్లు ఉంటారు. జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ, రిటైర్మెంట్ ప్రయోజనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
త్వరలోనే ఈ నూతన విద్యా విధానానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఇతర సంస్కరణల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ల ఆధునీకరణ, యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

