శంషాబాద్, 11 November
హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను తదుపరి విచారణ తేదీన కోర్టు ముందు హాజరుపరచాలని తెలంగాణ హైకోర్టు డీజీపీని ఆదేశించింది.

పిటిషన్లు తిరస్కరణ
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రంగనాథ్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఇదే వ్యవహారంలో మండల తహసీల్దార్‌ను కూడా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
హైడ్రా వ్యవహారంపై చర్చ
ఈ పరిణామాలతో హైడ్రా వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది. తదుపరి జరిగే విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.