సారాంశం
నిజాంపేట్ మల్లన్న గుడి (శివాలయం)లో 13వ రోజు అన్నదానం కార్యక్రమం దాత సిరిగల జనార్దన్ రెడ్డి కుమారుడు ఉపేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ...
ముఖ్య విషయాలు
- 1నిజాంపేట్ మల్లన్న గుడిలో అయ్యప్ప స్వాములకు అన్నదానం
నిజాంపేట్ మల్లన్న గుడి (శివాలయం)లో 13వ రోజు అన్నదానం దాత సిరిగల జనార్దన్ రెడ్డి కుమారుడు ఉపేంద్ర రెడ్డి చేతుల మీదుగా ఘనంగా జరిగింది.
- 2సుమారు 500 మంది అయ్యప్ప స్వాములు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి సంతృప్తి చెందారు.
- 3కార్తీక మాస ఉత్సవాలు
ఆలయ ప్రధాన అర్చకులు గౌతమ్ శర్మ మాట్లాడుతూ ఈ కార్తీక మాసంలో పరమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, అలాగే సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరగనున్నాయని తెలిపారు.
- 4నిర్వాహకుల కృతజ్ఞతలు
ఈ సందర్భంగా అన్నదానం నిర్వాహకులు ఏనుగుల మాధవ రెడ్డి, ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్నదానానికి విచ్చేసిన స్వాములకు, సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
Medchal-Malkajgiri, 12 November
నిజాంపేట్ మల్లన్న గుడి (శివాలయం)లో 13వ రోజు అన్నదానం దాత సిరిగల జనార్దన్ రెడ్డి కుమారుడు ఉపేంద్ర రెడ్డి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సుమారు 500 మంది అయ్యప్ప స్వాములు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి సంతృప్తి చెందారు.
ఈ సందర్భంగా అన్నదానం నిర్వాహకులు ఏనుగుల మాధవ రెడ్డి, ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్నదానానికి విచ్చేసిన స్వాములకు, సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
ఆలయ ప్రధాన అర్చకులు గౌతమ్ శర్మ మాట్లాడుతూ ఈ కార్తీక మాసంలో పరమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, అలాగే సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరగనున్నాయని తెలిపారు. ఆసక్తి కలవారు ఆలయ కార్యాలయంలో సంప్రదించవలసిందిగా కోరారు.