మద్దూరు, 13 November
మండలంలోని వంగపల్లి, రేబర్తి గ్రామాలలో జరుగుతున్న వివో భవనాల నిర్మాణ పనులను ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్, రేబర్తి సర్పంచ్ శ్రీనివాస్, వంగపల్లి సర్పంచ్ కె.రామస్వామి ఆధ్వర్యంలో పరిశీలించారు. వంగపల్లి గ్రామంలో ఈ నెల 19వ తేదీ నాటికి వివో భవనం, గ్రామ పంచాయతీ భవనం పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని సర్పంచులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి జి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి ఎన్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

