Medchal-Malkajgiri, 13 November
కుత్బుల్లాపూర్ నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ అయ్యప్ప ఆలయ చైర్మన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హిల్ కౌంటీలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్‌లోని శ్రీనివాస్ నగర్ అయ్యప్ప ఆలయ చైర్మన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, హిల్ కౌంటీలోని ఆయన నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మాన్యశ్రీ అరుణ్ గురుస్వామి నిర్వహణలో పడిపూజ ఎంతో శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని హనుమంతరెడ్డి స్వామివారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

