రఘునాథపాలెం, 4 November
మండలం చింతగుర్తి గ్రామంలో స్మశాన వాటిక వద్ద ప్రధాన వంతెన నిర్మాణం నెలల తరబడి నిలిచిపోవడంతో ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలల క్రితం పాత వంతెనను కూల్చివేసినప్పటికీ, పునర్నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం
ఈ విషయంపై వార్త ప్రచురితమైనా అధికారులు స్పందించలేదు. తాజాగా మురసు తుఫాన్ వర్షాలతో తాత్కాలిక మార్గం నీట మునిగి, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీంతో చింతగుర్తి వ్యవసాయ రైతులు, అదేవిధంగా కొర్లబోడు, పెద్దారపూడి, పంగిడి గ్రామాల ప్రజలు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
అధికారులు వెంటనే స్పందించి వంతెన పనులు వేగవంతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.