జిల్లా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్‌పేట్‌లో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీపావళి పండుగ శుభసందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
బొంరాస్‌పేటలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది గదులను పరిశీలించి, అక్కడి సౌకర్యాలు, పనితీరుకు సంబంధించిన పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దీపావళి పండుగ పర్వదినాన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం స్థానిక ప్రజలకు భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.

