Medchal–Malkajgiri/Ghatkesar (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 13
తమిళనాడులోని మదురైలో ప్రముఖ నగల సంస్థ తనిష్క్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.50 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు అపహరణకు గురైనట్లు ప్రాథమిక అంచనా. ఈ ఘటన కలకలం రేపింది.
తమిళనాడులోని మదురైలో ప్రముఖ నగల సంస్థ తనిష్క్ షోరూమ్ లో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. సుమారు రూ.50 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు అపహరణకు గురైనట్లు ప్రాథమిక అంచనా.
లిఫ్ట్ ఏర్పాటు కోసం ఉంచిన మార్గం ద్వారా ఓ దుండగుడు షోరూమ్ కి ప్రవేశించి నగలను దొంగిలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. షోరూమ్ ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ముసుగు ధరించిన వ్యక్తి కదలికలు గుర్తించినట్లు సమాచారం.
గురువారం ఉదయం సిబ్బంది షోరూమ్ కు చేరుకున్నప్పుడు నగలు కనిపించకపోవడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, చోరీకి గురైన నగల ఖచ్చితమైన విలువపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.






