ఖమ్మం జిల్లా మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీలో స్త్రీ నిధి రుణాల చెల్లింపులకు సంబంధించిన నగదు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మహిళా సంఘాల సభ్యులు నెలనెలా చెల్లించిన రుణ వాయిదాల సొమ్మును సంబంధిత ఖాతాల్లో జమ చేయకుండా, సుమారు రూ. 25 లక్షలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు గ్రామ దీపిక రమాదేవి గ్రామసభలో అంగీకరించినట్లు సమాచారం.
ఈ వ్యవహారం సోషల్ ఆడిట్ లో వెలుగులోకి రావడంతో మహిళా సంఘాల సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
గ్రామసభలో ఈ విషయాన్ని గ్రామ దీపిక రమాదేవి అంగీకరించినట్లు తెలిసింది.
సోషల్ ఆడిట్ ద్వారా ఈ నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన సొమ్మును సొంత అవసరాలకు వినియోగించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు.







