బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గం మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గం మండలంలో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
ప్రతిపక్ష నాయకులు పగటి కలలు కంటున్నారని, అప్పుడే ఒకరు ముఖ్యమంత్రి అయినట్లు, మరికొందరు మంత్రులైనట్లు ఊహించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడుతూ.. ఓ మాజీ మంత్రి అయితే ఏకంగా తానే ముఖ్యమంత్రి అయినట్లు ప్రమాణ స్వీకారం కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని, ముందు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో చూసుకోవాలని ఘాటుగా విమర్శించారు.
అవినీతి ఆస్తులపై మంత్రి పొంగులేటి
తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారు వివిధ దేశాలు, రాష్ట్రాల్లో హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ల రూపంలో వేలాది కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.
మంచుకొండ ఎలాగైతే కరిగిపోతుందో అదేవిధంగా వారి అవినీతి ఆస్తులను కరిగించి, తెలంగాణ ప్రజలకు పంచుతామని స్పష్టం చేశారు. ఆ సంపదను పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినియోగిస్తామని ఆయన తేల్చిచెప్పారు.












