కెరమెరి (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 11
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న ఆజాద్ 126వ జయంతి వేడుకలు
కెరమెరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం భారతరత్న, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహమ్మద్ సుజాయిత్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సుజాయిత్ ఖాన్ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, స్వతంత్ర భారతదేశంలో జాతీయ సమైక్యత, మత సామరస్యం, లౌకికవాద విలువల పరిరక్షణకు ఆయన విశేష కృషి చేశారని తెలిపారు.
భారతదేశం అన్ని మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులకు నిలయమని, దేశ ప్రజలందరూ ఐకమత్యంతో జీవించాలన్నది ఆజాద్ ఆశయమని ఆయన పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని నమ్మి, దేశ విద్యావ్యవస్థ అభివృద్ధికి పునాదులు వేశారని గుర్తుచేశారు.
ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసిందని సుజాయిత్ ఖాన్ తెలిపారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని విద్య, సామాజిక ఐక్యత, దేశాభివృద్ధికి కృషి చేయాలని సుజాయిత్ ఖాన్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ సిడమ్ జగన్నాథ్ రావు, జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శులు షేక్ మహమ్మద్, షేక్ ఫరూక్, మండల కార్యదర్శులు పిట్ల గిడ్డప్ప, మడవి రాజు, సిడమ్ తిరుపతి, సర్పంచ్ విమలబాయి, రాథోడ్ దేవీదాస్, మొహర్లే నాగేష్, దత్తు, అయూబ్ ఖాన్, ఆత్రం విశేష్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


