నేలకొండపల్లి, 2047-11-12
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించి, పలు మండలాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఖమ్మం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి పీఏ కె.వి.కె.రాఘవరావు ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉదయం 7 గంటలకు హైదరాబాద్లోని హిమాయత్ సాగర్ నివాసం నుండి బయలుదేరుతారు.
ఉదయం 10 గంటలకు నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నేలకొండపల్లి మండల లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట రోడ్డులో గల ... రెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ఇంటర్ స్కూల్/కాలేజ్ క్విజ్ పోటీలో మంత్రి పాల్గొంటారు. భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం రూరల్ మండలంలోని ..పాలెం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 4.30 గంటలకు కుసుమంచి మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది.
అనంతరం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.






