ఖమ్మం, 12 November
జిల్లాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధితులు, నిరుపేద వృద్ధులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి. రామారావు ముఖ్య అతిథిగా హాజరై కిట్లను అందజేశారు.
జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల (ట్రస్ట్) ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ప్రతి నెల 12వ తేదీన నిర్వహిస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలలో భాగంగా బుధవారం హెచ్ఐవి బాధితులు, నిరుపేద వృద్ధులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి. రామారావు ముఖ్య అతిథిగా హాజరై బాధితులకు కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా డా. రామారావు మాట్లాడుతూ... 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా హెచ్ఐవి బాధితులకు, వృద్ధులకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. గత నెలలో టీబీ వ్యాధిగ్రస్తులకు కూడా పోషకాహార కిట్లు పంపిణీ చేశారని గుర్తు చేశారు.
వైద్యంతో పాటు సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల హెచ్ఐవి బాధితుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో దాతలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సేవాదళ్ సభ్యులు, అధ్యక్షుడు శంకర్, సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






