దుల్మిట్ట (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 10
దుబ్బతండ గ్రామ పంచాయతీలో ఎల్ నినో వాతావరణ మార్పులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు, తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలని సూచించారు.
మండలంలోని దుబ్బతండ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ పాల్థియా రమేష్ ఆధ్వర్యంలో ఎల్ నినోపై అవగాహన కల్పించేందుకు కళాబృందం చేత గ్రామ ప్రజలకు ఒక కార్యక్రమం నిర్వహించారు. రైతులు తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేయాలని, నీటి వృధాను అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






