ఖమ్మం, 10 November
ఖమ్మం నగర ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించేందుకు వీడీఓస్ కాలనీలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో రెండవ ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు.
ఖమ్మం పట్టణ ప్రజలకు శుభవార్త. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకు అందించేందుకు వీడీఓస్ కాలనీలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో రెండవ ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ తెలిపారు.
గాంధీ చౌక్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ లో మొదటి కేంద్రం విజయవంతంగా నడుస్తుండగా, ప్రజల డిమాండ్ మేరకు రెండో కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు.
బియ్యం ధరలు
- బీపీటీ / కేఎన్ఎమ్ రకం - కిలో రూ. 66 - ఆర్ఎన్ఆర్ / తెలంగాణ సోనా రకం - కిలో రూ. 74 - హెచ్ఎంటీ / జేఎస్ఆర్ రకం - కిలో రూ. 79
మార్కెట్ కు వచ్చిన వినియోగదారులు బియ్యం కొనుగోలుకు ఆసక్తి చూపారని, తమ ప్రాంతంలోనే తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారని అధికారి తెలిపారు. ఖమ్మం పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






