మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా చేరికల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో మండలం దామెర గ్రామానికి చెందిన పలువురు నాయకులు సిద్ధిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. వారికి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మండల కేంద్రంలోని దామెర గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా చేరికల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈరోజు సిద్ధిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో మండలం దామెర గ్రామానికి చెందిన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు.
మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ గారు నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు బీజేపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన నాయకులు వీరే
ఒద్దుల రవి, ఒద్దుల సంపత్, పిప్పల విజేందర్, పండ్రాల రమేష్, కోప్పర ప్రభాకర్, కోప్పర సంబరాజు, సాతురి వరుణ్, ఠాకూర్ రోహిత్ సింగ్ వంటి నాయకులు బీజేపీలో చేరారు.
ఈ కార్యక్రమంలో దామెర శక్తి కేంద్ర ఇన్చార్జి శామ్ సింగ్, సాతురి ప్రభాకర్, చల్ల రవీందర్ రెడ్డి, పండ్రాల సదానందం, పండ్రాల రాజయ్య, నామిండ్ల ప్రవీణ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.









