పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
కెరమెరి మండలం, పార్ద గ్రామపంచాయతీ పరిధిలోని సగంశ్వరానగర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఆసిఫాబాద్ మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు పాల్గొని ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, కళలను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మునీర్ అహ్మద్, స్థానిక సర్పంచ్ మాడవి చిత్రారేఖ సీతారామ్, మండల సర్పంచులు కుంరం భీంరావ్ తుమ్మగూడ, జాదవ్ అమూల్ దేవాపూర్, నాయకులు పూసం భీంరావు, బండి సాయి, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.











