ఖమ్మం, 8 November
దీపావళి పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలో టపాసులు కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
దీపావళి పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ కళాశాల మైదానంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా టపాసుల దుకాణాలను ఏర్పాటు చేశారు. టపాసుల కొనుగోలుకు నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల పట్టణాలు, పల్లెల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
దీపావళి పండుగ సందర్భంగా టపాసుల కొనుగోలుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో, ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. కార్పొరేషన్ ట్రాఫిక్ విభాగం అధికారులు స్వయంగా రంగంలోకి దిగి, కిందిస్థాయి సిబ్బందితో కలిసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
పోలీసుల అప్రమత్తత
సాయంత్రం వేళలో రద్దీ మరింత పెరిగినప్పటికీ, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వాహనదారులకు, టపాసులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. తమ వృత్తిపరమైన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పండుగ వాతావరణంలో ప్రజలకు సహకరించారు.
ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా కొనుగోళ్లు చేసుకునేందుకు సహకరించిన ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఆజాద్ తెలంగాణ ఖమ్మం










