మద్దూరు, 8 November
మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనగామ నియోజకవర్గ ఇంచార్జీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు, మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ళ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా డిసిసి కార్యదర్శి రామడుగు బాలరాజు, మండల ఉపాధ్యక్షులు జీడికంటి సురేష్, తోడంగుల భాస్కర్, మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఇట్టబోయిన కనకచంద్రం, సుందరగిరి సత్యనారాయణ, ఏఏంసి డైరెక్టర్ ఆరే వెంకటనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి నలగోపుల రాజు గౌడ్, జక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, కార్యదర్శులు ఒగ్గు రవి, కూకట్ల ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












