Medchal–Malkajgiri/Medchal (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 13
శ్రీ భక్త శివ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం దామెర గ్రామ నూతన కమిటీ ఎన్నికైంది. సంఘం అభివృద్ధి, కుల బాంధవుల ఐక్యత, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ ప్రధాన లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. బేతి కేశవులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
శ్రీ భక్త శివ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం దామెర గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధి, కుల బాంధవుల ఐక్యత, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ ప్రధాన లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్షుడిగా బేతి కేశవులు, ఉపాధ్యక్షులుగా అల్లి వరప్రసాద్, పోతరాజు తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా స్వర్గం అనిల్, కోశాధికారిగా వేముల వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శిగా గాజుల సుధాకర్ ఎన్నికయ్యారు.
కమిటీ సభ్యులు
గంజి శ్రీశైలం, గుర్రపు మనోహర్, అన్నం వెంకటేష్, గబ్బెటి రమేష్, గబ్బెటి రవీందర్, గుర్రపు రమేష్, స్వర్గం వేణు, గబ్బెటి శ్రీనివాస్, అల్లి రాజు, స్వర్గం సతీష్ బాబు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, పద్మశాలి కుల బాంధవుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని, అందరినీ కలుపుకొని ఐకమత్యంతో ముందుకు సాగుతామని తెలిపారు.
సంఘం ఆధ్వర్యంలో సామాజిక, సేవా కార్యక్రమాలను చేపడుతూ, సంఘానికి మంచి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.






