తెలంగాణ, 8 November
పాలేరు నియోజకవర్గంలో పేదల ప్రభుత్వ సహకారంతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి పండగ ఘనంగా జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నామని, శ్రీనన్నకు, ఇందిరమ్మ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని ఒక లబ్ధిదారురాలు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి, ఆప్యాయంగా ఆమెను చెల్లెమ్మా అని పిలిచి, కన్నీళ్లు తుడిచి ఓదార్చారు.
ప్రభుత్వ లక్ష్యం
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని, ప్రతి ఇంట్లో దీపావళి పండగ వాతావరణం ఉండాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.











