ఖమ్మం జిల్లా, రఘునాధపాలెం మండలం, చింతగుర్తి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా సొంతింటి కల నెరవేరిన పేద కుటుంబాల ఇళ్లలో ఆదివారం దీపావళి పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా గ్రామంలో లబ్ధిదారుల గృహప్రవేశాలు, దీపాల అలంకరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తమ్మినేని ప్రియాంక, ఉప సర్పంచ్ పేరపోగు భరత్, మాజీ సర్పంచ్ తమ్మినేని నాగేశ్వరరావు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపాలు వెలిగించి, వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తమ్మినేని ప్రియాంక మాట్లాడుతూ, పేదల సొంతింటి కల సాకారం కావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఈరోజు గ్రామంలోని ఎంతోమంది పేద కుటుంబాలకు సొంతిల్లు సమకూరిందని, లబ్ధిదారుల కుటుంబాల్లో దీపావళి వెలుగులు నింపాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
చింతగుర్తి నుండి ఆజాద్ తెలంగాణ ప్రతినిధి.










